పాకిస్థాన్‌లోని లాహోర్‌లో కాలుష్యం రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో అక్కడి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకూ వర్క్-ఫ్రమ్-హోమ్ తప్పనిసరి చేసింది. లాహోర్‌లో పొగమంచు కమ్ముకోవడంతో పౌరులు ఇళ్లకే పరిమితం కావాలని, కిటికీలు కూడా మూసి ఉంచుకోవాలని తెలిపింది. నిర్మాణ రంగం, తదితర పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.