తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు పదేళ్ల గరిష్ఠానికి చేరాయి. మిగతా జిల్లాల్లోనూ దాదాపు 41 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంది.