ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు

ఈ ఏడాది వేసవి హైదరాబాద్ ప్రజలకు పీడకలగా మిగిలింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 1 వరకు 47 రోజులు నగరం 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఇది పదేళ్ల క్రితం నాటి రికార్డులను బద్దలు కొట్టింది. పగలు రోడ్డుపై అడుగుపెడితే నిప్పుల కొలిమిలా, రాత్రి అయితే నిద్రపోనివ్వని ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం, చెట్లు, నీటి వనరులు తగ్గిపోవడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ కండీషనర్లు కూడా వేడిని పెంచుతున్నాయని, భవిష్యత్తులో వాతావరణ మార్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్