కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరులో భీష్మ ఏకాదశి సందర్భంగా నాటకాల పేరుతో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ విజయశంకర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఎస్సై మౌనిక కేసు నమోదు చేసి, పోలీసులపై దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.