SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 11-12 వేల నియామకాలను చేపట్టనున్నట్లు SBI ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. క్లరికల్, ఆఫీసర్ కేటగిరీల్లో ఖాళీలున్నాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా, తమ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి కొత్తగా 250 బ్రాంచ్‌లను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి SBIలో ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY26) SBI 25,633 మందిని నియమించుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕