ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మృతి చెందగా, 24 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు, NIA దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలిలో బుల్లెట్ లభించడం కీలకంగా మారింది. పేలుడుకు, బుల్లెట్‌కు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ప్రకారం.. నెమ్మదిగా కదులుతున్న కారులో పేలుడు సంభవించింది, అందులో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. CNG సిలిండర్ పేలి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.