దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన నియోజకవర్గాల పునర్విభజన ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక సువర్ణావకాశంగా అభివర్ణిస్తున్నారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని, అలాంటి అవకాశమే ఇప్పుడు చంద్రబాబుకు దక్కిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2009లో వైఎస్ వ్యూహాత్మకంగా నియోజకవర్గాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో వ్యవహరించి టీడీపీ భవిష్యత్తును పటిష్టం చేసుకుంటారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.