యూరియా వాడకం తగ్గిస్తే నేలకు మేలు: శాస్త్రవేత్తలు

యూరియా వాడకాన్ని తగ్గిస్తే నేల తల్లికి మేలు జరుగుతుందని వ్యవవసాయ శాస్త్రవేత్తలు వివరించారు. మంచిర్యాల జిల్లాలోని తాండూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజ నరేందర్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ష్రైన్ పాల్గొని సూచనలు అందించారు. సాగు నీటిని ఆదా చేయడం, పంట మార్పిడి చేయడం ద్వారా చీడపీడలను తగ్గించవచ్చని, పత్తి, జొన్న, మొక్కజొన్నతో పాటు పప్పు దినుసులు, కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్