కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.33.50 మేర తగ్గిస్తున్నట్లు తెలిపాయి. కొత్త ధరలు శుక్రవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి.