శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 36,233 క్యూసెక్కులుగా, ఔట్‌ఫ్లో 38,369 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 878.10 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 178.7400 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతోంది.