రీల్స్ కోసం కొందరు యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలు తాగే నీళ్లలో కొందరు యువకులు ఈత కొట్టిన వీడియో SMలో వైరల్ అవుతోంది. UPలోని ఉమర్‌పూర్ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగు నీళ్లందించే ట్యాంకులోకి దిగి ఇద్దరు యువకులు ఈత కొడుతుండగా ఓ వ్యక్తి వారిని వీడియో తీసి SMలో పోస్ట్ చేశారు. వీరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 200ft ఎత్తు ఉన్న ట్యాంకును ప్రమాదకరంగా ఎక్కడమే కాకుండా తాగునీటిలో ఈత కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.