నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ 101వ వార్షికోత్సవం మరియు దసరా వేడుకల్లో ఆ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని బలహీనపరిచి, తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో భారత్‌లో కూడా పాలనా మార్పు (రెజిమ్ ఛేంజ్) చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అయితే దేశంలోని బలమైన నాయకత్వం వల్ల అది అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని విభజించేందుకు కొంతమంది నాయకులు సహకరిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు.