భారతీయ అమ్మాయిల తిరస్కరణతో ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కు పెళ్లి కష్టాలు

అమెరికాలో స్థిరపడిన 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, లక్షల్లో జీతం ఉన్నప్పటికీ భారతీయ అమ్మాయిల నుంచి వరుసగా తిరస్కరణలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదనకు లోనయ్యాడు. భారతదేశానికి తిరిగి వచ్చి స్థిరపడాలని భావిస్తున్న అతను, ఇండియాలో ఉంటున్న అమ్మాయిలతో సంభాషణలు ప్రారంభించాడు. అయితే, ఎప్పుడు తిరిగి వస్తాననే దానిపై స్పష్టత ఇవ్వకపోవడమే సమస్యగా మారిందని డేటింగ్ కోచ్ ఓంద్రిలా కపూర్ తెలిపారు. అమ్మాయిలు నెలల తరబడి సమయం వృథా చేయడానికి, లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం అభద్రతాభావాన్ని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్