ఢిల్లి సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్‌గా విజయేంద్ర గుప్తా, పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్