మహిళ, ఆమె ప్రియుడికి నిప్పంటించిన భర్త బంధువులు.. ఇద్దరు మృతి

మహిళ, ఆమె ప్రియుడిపై భర్త బంధువులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఇటీవల ఈ ఘటన జరిగింది. మోఖంపురా ప్రాంతంలోని బరోలావ్ గ్రామానికి చెందిన  సోని(30) భర్త చనిపోయాడు. ఈ క్రమంలో కైలాష్ గుర్జార్‌(25) అనే వ్యక్తితో సోని ఎఫైర్ పెట్టుకుంది. నవంబర్‌ 28న అర్థరాత్రి వీరు కలుసుకోగా.. సోని భర్త తరుఫు బంధువులు వారిద్దరిని కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ డిసెంబర్‌ 1న కైలాష్‌, బుధవారం సోని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్