EMI చెల్లించడానికి డబ్బులు లేవని.. తల్లీకూతుళ్లను చంపిన బంధువులు

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో, ట్రాక్టర్ EMI చెల్లించలేక అప్పు తీర్చడానికి సొంత బంధువులే తల్లికూతుళ్లను దారుణంగా హత్య చేశారు. మే 28న దేవ్‌గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోపఖేడా పాల్ గ్రామంలో నిద్రిస్తున్న మంకీ మీనా, ఆమె కుమార్తె కమలను.. మంకీ మీనా మరిది బాబులాల్ మీనా, అతని భార్య గెండాబాయిలు కలిసి హత్య చేశారు. ట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి, మృతుల వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించేందుకు ఈ హత్యలకు పాల్పడ్డారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో బాబులాల్ నేరం అంగీకరించాడు.

సంబంధిత పోస్ట్