రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) మంగళవారం 'బాంబే క్రీమరీ' అనే కొత్త బ్రాండ్ను ఆవిష్కరిస్తూ ఐస్క్రీమ్ మార్కెట్లోకి ప్రవేశించింది. డెయిరీ క్రీమ్తో తయారుచేసిన ఐస్క్రీమ్లను కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ రూపంలో రూ.10 నుంచి ప్రారంభమయ్యే ధరలకు విక్రయించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. మొదట పశ్చిమ రాష్ట్రాల్లో లభించే ఈ ఐస్క్రీమ్లు క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. భారతీయులకు అందుబాటు ధరలో అసలైన ఐస్క్రీమ్ రుచిని అందించడమే తమ లక్ష్యమని RCPL డైరెక్టర్ టి కృష్ణ కుమార్ తెలిపారు.