మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట

సినీనటులు మంచు మోహన్ బాబు, విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తమ కాలేజీకి చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం మోహన్ బాబు, విష్ణు 2019 మర్చి 22న సిబ్బంది, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా డిస్మిస్ చేసింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును అశ్రయించగా పోలీసులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కేసు కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్