రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంక్ ఖాతాలు పునరుద్ధరణకు ఆదేశాలు

బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి న్యాయపరమైన ఉపశమనం లభించింది. 2020లో ఆమె అరెస్ట్ సమయంలో స్తంభింపజేసిన ఆమె, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలను తక్షణమే పునరుద్ధరించాలని ముంబైలోని ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సరైన ప్రక్రియను పాటించలేదని, చట్టవిరుద్ధంగా ఖాతాలను స్తంభింపజేసిందని కోర్టు నిర్ధారించింది. దాదాపు ఆరేళ్ల పాటు నిధులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని రియా తరపు న్యాయవాదులు తెలిపారు.

సంబంధిత పోస్ట్