‘బ్లడ్ మనీ'పై మత గురువు రాయబారం

ఉరిశిక్ష నుంచి కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు గ్రాండ్ ముఫీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారు. ‘బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మేం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. శిక్ష పడకుండా చేయగలిగే మార్గం ఇదొక్కటే’ అని న్యాయవాది శుభాష్ చంద్రన్ మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్