AP: గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. ఏలూరు(D) నాగన్నగూడేనికి చెందిన నిందితుడు భీముడు అజిత్‌కుమార్ OLXలో తనకు తాను డీలర్‌గా పరిచయం చేసుకుని కార్లను విక్రయిస్తానంటూ వినియోగదారులను నమ్మించేవాడు. డబ్బులు తన ఖాతాలో పడ్డాక.. ఫోన్ స్విచాఫ్ చేసుకునేవాడు. అతనిపై 32 కేసులు ఉండగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పోలీసులకు వాటెండ్ క్రిమినల్‌గా మారాడు. భీముడు అజిత్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.25 వేల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.