బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడిన రెస్క్యూ టీం (వీడియో)

హరియాణాలోని ఫరీదాబాద్‌లో మూడేళ్ల చిన్నారి 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. నిన్న (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఘటన జరగగా.. ఫైర్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది దాదాపు 10 గంటలపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారిని రక్షించారు. బోరుబావిలోకి నిరంతరం ఆక్సిజన్‌ పంపిస్తూ, కెమెరాల సాయంతో చిన్నారి ఆచూకీ గుర్తించారు. తల కిందకు, కాళ్లు పైకి ఉన్న స్థితిలో ఉన్న చిన్నారిని సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు సురక్షితంగా వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕