మధుమేహాన్ని తగ్గించే మొక్కను గుర్తించిన పరిశోధకులు.. ఎక్కడంటే?

డయాబెటిస్‌ను తగ్గించే లక్షణం ఉన్న అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. బీహార్ రాష్ట్రంలోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై గుర్మార్ మొక్కను గుర్తించిన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహ చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధం తయారీకి గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది. ఫలితంగా తీపి పదార్థాలు తిన్నాలన్న కోరికను తగ్గిస్తుంది.

సంబంధిత పోస్ట్