జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిని భాజపా ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.