బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్‌లు, సిస్టమ్ సర్వీసుల వల్ల ఫోన్ ప్రాసెసర్‌పై భారం పెరుగుతుంది. ఫోన్‌ను వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయడం వల్ల RAM ఖాళీ అయ్యి, డివైజ్ మరింత వేగంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది సిస్టమ్‌లోని లోపాలను పరిష్కరించడమే కాకుండా, హ్యాంగ్ సమస్యలను తగ్గించి, బ్యాటరీ వినియోగాన్ని ఆదా చేస్తుందంటున్నారు. భద్రతాపరంగా కూడా, మెమరీలో దాగి ఉన్న అనుమానాస్పద ప్రాసెస్‌లను నిలిపివేస్తుందని వివరించారు. శాంసంగ్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆటో-రీస్టార్ట్ ఫీచర్‌ను సెట్ చేసుకోవచ్చు, దీనివల్ల ఫోన్ తనంతట తానుగా రీస్టార్ట్ అవుతుందని స్పష్టం చేశారు. వారానికి ఒక్కసారి రీస్టార్ట్ చేయడం ఫోన్ ఆయుష్షును పెంచుతుందని సూచించారు.