తమిళనాడులోని తంజావూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఒక రెస్టారెంట్‌లో చోరీ జరిగింది. కప్పు (పైకప్పు) పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ, రెస్టారెంట్ నుంచి నగదును దొంగిలించాడు. దొంగ లోపలికి చొరబడిన దృశ్యాలు, చోరీకి సంబంధించిన ఘటనంతా రెస్టారెంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.