భారతీయ మహిళ ఊర్వశి జపాన్‌లో చూసిన ఓ ఘటనను వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. ఒక రెస్టారెంట్ బయట ఎవరో వాంతులు చేసుకున్నప్పుడు, అక్కడి సిబ్బందిలో ఒకరు ఎలాంటి అసహ్యం లేకుండా నేరుగా చేతులతోనే శుభ్రం చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, జపాన్‌లో ప్రజా బాధ్యతగా భావించి శుభ్రం చేయడమే అక్కడి పరిశుభ్రతకు కారణమని ప్రశంసించారు. ఈ సంఘటన జపాన్ ప్రజల మనస్తత్వాన్ని తెలియజేస్తుందని ఊర్వశి పేర్కొన్నారు.