కమర్షియల్ సిలిండర్ల డెలివరీ పునరుద్ధరణ.. కేంద్రం ప్రకటన

దేశంలోని పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల డెలివరీని పునరుద్ధరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ సంక్షోభం కారణంగా ఇటీవల కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయబడింది. అయితే, LPG ఉత్పత్తిని పెంచడంతో, నేటి నుండి కమర్షియల్ సిలిండర్ల పంపిణీ కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. అయితే ఏయే రాష్ట్రాల్లో ఈ పంపిణీ ఉంటుందో మాత్రం వెల్లడించలేదు.

సంబంధిత పోస్ట్