ఒంగోలులో బాలికపై రిటైర్డ్ ఉద్యోగి అత్యాచారయత్నం

AP: ఒంగోలులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వసతి గృహంలో ఉంటున్న బాలికలను, తండ్రి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ హాస్టల్ నుంచి బయటకు తీసుకువచ్చిన వంట మనిషి, రిటైర్డ్ ఉద్యోగి ఇంటి వద్ద వదిలివేసింది. అక్కడ బాలికలను ఇంట్లో బంధించినట్లు ఆరోపణలున్నాయి. బంధువులకు మరో బాలిక ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు రిటైర్డ్ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన అతడిపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕