ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బాలసుబ్రహ్మణ్యం న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రవాణా శాఖ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీ, ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్ సీఈఓగా ఆయన కీలక సేవలందించారు. ఆయన అకాల మరణంపై ఏపీ పోలీసు శాఖ, ఆర్టీసీ అధికారులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.