8 వారాల్లోగా పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాలి: హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసిన ఎనిమిది వారాల్లోగా.. తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని తీర్పునిచ్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన రిటైర్డ్ HM చోల్లెటి రాజా సుకన్య వేసిన పిటిషన్‌కు కోర్టు ఊరటనిచ్చింది. ఆమెతో పాటు పలువురి పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్