పదవీ విరమణ.. ఎస్సైను గుర్రంపై ఊరేగించారు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని హాఫిజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై ప్రదీప్ చౌదరి పదవీ విరమణ  సందర్భంగా, ఆయనను పోలీస్ సిబ్బంది ఒక పెండ్లి కొడుకులా అలంకరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్ఐ ప్రదీప్ చౌదరిని గుర్రంపై కూర్చోబెట్టి  స్టేషన్ ఇన్‌ఛార్జితో సహా ఇతర పోలీసులందరూ కలిసి ఊరేగింపుగా వచ్చి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్