హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘భారతదేశం-అమెరికా మధ్య దౌత్య సంబంధాలు 1947లో ప్రారంభమయ్యాయి. నేటి వరకు వివిధ రంగాల్లో అవి మరింత దృఢంగా మారాయి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయాలి’ అని సీఎం అన్నారు. కాగా ఈ వేడుకలకు ఇరు దేశాల అధికారులు, వ్యాపారవేత్తలు, అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హాజరయ్యారు.