అమెరికా వెళ్లొచ్చే లోపు సీఎం సభ్యత్వమే పోయేలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం లేదా నల్లగొండ నేతలు బాంబు పేల్చే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సబితాఇంద్రారెడ్డిని సీఎం, డిప్యూటీ సీఎం అవమానించారని, క్షమపణలు చెప్పమంటే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు.