ఎల్‌నినో ప్రభావంతో చుట్టుముడుతున్న వ్యాధులు.. హెచ్చరిస్తున్న WHO

ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వేడిగాలులు, కరువులు, అడవి మంటలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వీటి వల్ల వడదెబ్బ, డీహైడ్రేషన్, శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు. వాతావరణ మార్పులతో దోమల వ్యాప్తి పెరిగి డెంగీ, మలేరియా, కలుషిత నీటి ద్వారా కలరా వంటి వ్యాధుల ముప్పు ఏర్పడవచ్చు. పంటలు దెబ్బతినడం, నీటి కొరతతో పోషకాహార లోపం కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2027 ప్రారంభం వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగవచ్చన్న అంచనాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు కీలకమని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕