సీఎం రేవంత్ రెడ్డిపై నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు

TG: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బలవంతంగా ట్యాక్స్ వసూలు చేసి, కాంగ్రెస్ పెద్దల ఖర్చుల కోసం ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అమాయకులు, వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేదని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్