TG: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరిస్తోందని MLC కవిత మండిపడ్డారు. 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇందుకోసం ఈ నెల 17వ తేదీన రైల్ రోకో నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదనీ, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రావడం లేదన్నారు. సింగరేణిని ప్రయివేటుపరం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.