రేవంత్ రెడ్డి స‌ర్కార్ మ‌ళ్లీ రావాలి: ఆది శ్రీనివాస్

ప్రజలు మళ్లీ ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని ఆకాంక్షిస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఉండదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీలకు అవకాశం లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్