TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వడ్ల కుప్పల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.