TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని 'గుంపు మేస్త్రీ' కాదని, 'ముంపు మేస్త్రీ' అని ఎద్దేవా చేశారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దద్దమ్మ, ఫెయిల్యూర్ సీఎం రేవంత్ అని ఆయన ఆరోపించారు. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు కన్నీరు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రతి రైతు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలచుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్స్‌ను 12 కిలోమీటర్లు తవ్విందని, ఎస్‌ఎల్‌బీసీలో కార్మికులు చనిపోతే శవాలను కూడా బయటకు తీయలేకపోయారని విమర్శించారు.