కవిత పార్టీకి రేవంత్ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు: ఎంపీ అర్వింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురువారం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత కార్యక్రమాలకు, పార్టీ కార్యకలాపాలకు సీఎం రేవంత్ రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని, వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో బీసీల మద్దతుతో బీజేపీ బలోపేతం అవుతోందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో నాయకుల వలసలు, అంతర్గత కుమ్ములాటలు చూసి ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్