సీఎం రేవంత్ రెడ్డిపై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఆరోపించారు. ఒకే ప్రెస్ మీట్‌లో అసెంబ్లీకి రావాలని, వెంటనే ఉరి తీయాలని అంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అగౌరవంగానే ప్రవర్తించారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు మాటలకు ప్రజలు ఈసారి ఆయనను కసబ్ లాగా ఉరి తీస్తారని ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యానించారు.