TG: సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజలను హామీలు రద్దు చేస్తానని బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శనివారం రాత్రి రెహమత్‌నగర్‌లో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. 'రద్దు చేస్తా.. రద్దు చేస్తా అని ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది' అని అన్నారు.