50 వేల మందిని రేవంత్ రెడ్డి రోడ్డు మీద పడేయాలని చూస్తున్నాడు: KTR

TG: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా హైడ్రా చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైర్ అయ్యారు. రాజేంద్ర నగర్ లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ దాదాపు పదివేల కుటుంబాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోందని అన్నారు. దీని ప్రకారం 50 వేల మంది ప్రజలను రేవంత్ రెడ్డి రోడ్డు మీద పడేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే.. ఇవాళ వాళ్ళ అందరిని ఎత్తి అవతల పడేస్తా అంటే EMIలు ఎవరు కట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్