TG: పంచాయితీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. దానిని ఆపాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరుఫున ప్రచారం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దీనిపై జాగృతి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు.