ఛత్తీస్‌గఢ్‌ సీఎంతో రేవంత్‌రెడ్డి భేటీ

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ ఇవ్వాలని విష్ణుదేవ్ సాయిని రేవంత్ రెడ్డి కోరారు. ఎల్ నినో వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే ఛాన్స్ ఉందని సీఎం రేవంత్ వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీరు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕