రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. జులై 4న కృతజ్ఞత సభ

TG: సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు రాజకీయంగా జన్మనిచ్చిన మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌ మండలం రుణం తీర్చుకోవాలని సంకల్పించారు. జులై 4న మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మిడ్జిల్‌ సమీపంలో గోపాల్‌రెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2006లో మిడ్జిల్‌ జెడ్పీటీసీగా తొలి విజయం సాధించిన రేవంత్‌రెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా ఎదిగి, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్