TG: సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించిన బంద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని, విద్యను వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని తాట తీస్తామంటూ హెచ్చరించారు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని, కాలేజీలు, రాజకీయ పార్టీలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్త సమస్యలు వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తమకు తెలుసునని, బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదని ఆయన అన్నారు.