ప్రజలను మోసం చేయడానికి రేవంత్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామా: డీకే అరుణ

TG:  ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ఏదో ఒకటి తెరపైకి తెస్తున్నారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌లో సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి తెచ్చారని, ఎన్నికల తర్వాత దీనికి ప్రాధాన్యత ఉండదని ఆమె తెలిపారు. సిట్ నోటీసులు ఎన్నికల వేళ మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చాయని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్