మరికాసేపట్లో మున్సిపల్ అధికారులతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మూడు కార్పొరేషన్ల పరిధిలో శుభ్రత, పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాల కోసం 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. నగర శుభ్రత, శానిటేషన్ పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులతో శుక్రవారం నాడు సీఎం భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం, వచ్చే నెల 3 లేదా 4 తేదీల్లో సీఎం ఆకస్మిక తనిఖీలపై స్పష్టత రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్